Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు

21-06-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* జీవో నెం. 44 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

​* ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరైందని ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.​చౌటుప్పల్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అదనపు కోర్టు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ కోరగా, హైకోర్టు గతేడాదే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని చెప్పారు. అయితే ఏడాదిన్నరగా ఆర్థిక అనుమతులు పెండింగ్‌లో ఉన్న ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అనుమతులు ఇప్పించారన్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో నెం. 44 జారీ చేసిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సబ్‌ కోర్టు ఏర్పాటు కోసం కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి న్యాయవాదులను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. అదనపు కోర్టు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News