Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
21-06-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి: యోగా గురువులు పాండు, పాపయ్య

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డులో మార్నింగ్ వాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం అసోసియేషన్ సభ్యులు, స్థానిక చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వివిధ యోగాసనాలు వేశారు.​ఈ సందర్భంగా యోగా గురువులు పాండు, పాపయ్యలు మాట్లాడుతూ.. యోగాను కేవలం జూన్ 21 ఒక్క రోజుకే పరిమితం చేయకూడదని హితవు పలికారు. శారీరక, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యకరమైన అలవాట్లను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి, మార్నింగ్ వాకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెల్తురి జంగయ్య, ఓంకార్, ఉపాధ్యక్షులు ఉష్కాగుల వెంకటేష్, శ్రీశైలం, మనీ, కాసర్ల సత్య వర్ధన్ రెడ్డి, బండి వెంకటరెడ్డి, జయంత్ అశ్విత్, చింతల ప్రభాకర్ రెడ్డి, మెట్టు రామచంద్ర రెడ్డి, కళ్లెం నాగరాజు, ఉప్పునూతల గణేష్, జటంగి రాజు, రవి, ఉడుగు రమేష్, తోర్పునూరి సాయికుమార్, పోటు రవి, సిద్దు, బాలగోని మణి, చింతకింది గణేష్, జక్కర్తి శేఖర్, పొన్నాల సుల్తాన్, వెంకటేష్, చెరుకు చైతన్య, పొట్ట ప్రవీణ్ కుమార్, సిద్ధ గొని ఉపేందర్, పంతంగి అఖిల్, డబ్బేటి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News