Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:19 PM

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
21-06-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీనగర్, న్యూస్‌టుడే: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎల్‌బీనగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమల్ల రామ్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు మరువలేనివని పేర్కొన్నారు.

రానున్న జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు కార్పొరేటర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కార్యక్రమంలో కాచం సత్యనారాయణ గుప్తా, బీరెల్లి వెంకట్‌రెడ్డి, ఉప్పల శ్రవణ్‌కుమార్ గుప్తా, సాల్వాచారి, ఏలే పురేందర్ నేత, దాము మహేందర్ యాదవ్, కూర రమేష్ గుప్తా, చినం రమేష్ కురుమ, బండారు మల్లేష్ గౌడ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News