Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

అవినీతి ఆందోళనకర స్థాయికి చేరింది ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అవసరం: గుత్తా సుఖేందర్‌రెడ్డి

21-06-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: రాష్ట్రంలో అధికారుల్లో అవినీతి ఆందోళనకర స్థాయికి చేరిందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. గతంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలే ప్రజాప్రతినిధులుగా ఎదిగేవారని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లే రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు.

చిన్నస్థాయి ఉద్యోగుల వద్ద కూడా కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వానికి అధికారులపై పూర్తి అజమాయిషీ ఉండాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులకు తిరిగి పోస్టింగులు ఇవ్వొద్దని అభిప్రాయపడ్డారు.

రాజకీయ నాయకుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని, మిగిలిన వారు ప్రజాసేవకే కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, సేద్యయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని సూచించారు.

Sthanikam

అవినీతి ఆందోళనకర స్థాయికి చేరింది ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అవసరం: గుత్తా సుఖేందర్‌రెడ్డి

Article Image

నల్గొండ,: రాష్ట్రంలో అధికారుల్లో అవినీతి ఆందోళనకర స్థాయికి చేరిందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. గతంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలే ప్రజాప్రతినిధులుగా ఎదిగేవారని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లే రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు.

చిన్నస్థాయి ఉద్యోగుల వద్ద కూడా కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వానికి అధికారులపై పూర్తి అజమాయిషీ ఉండాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులకు తిరిగి పోస్టింగులు ఇవ్వొద్దని అభిప్రాయపడ్డారు.

రాజకీయ నాయకుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని, మిగిలిన వారు ప్రజాసేవకే కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, సేద్యయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News