Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 PM

నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు!

22-06-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో సోమవారం తీవ్ర కలకలం రేగింది. ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం స్థానికంగా పెద్ద దుమారాన్ని లేపింది. మృతులను మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనాతో పాటు మరో ఇద్దరిగా గుర్తించారు. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ కాలనీలోని సదరు ఇల్లు గత కొన్ని రోజులుగా మూసి ఉంచబడింది. అయితే, ఈరోజు ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా, లోపల నాలుగు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్నాయి. మృతదేహాలు బాగా దెబ్బతినడాన్ని బట్టి చూస్తే, వారు కనీసం నాలుగు రోజుల క్రితమే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ​మృతుల్లో హసీనా స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, ఆమె భర్త మహమ్మద్ సుల్తాన్ ప్రకాశం బజార్‌లోని ఒక బ్యాగుల దుకాణంలో వ్యాపారంలో తోడుగా ఉంటున్నట్లు స్థానికులు వెల్లడించారు. వీరితో పాటు మరణించిన మిగతా ఇద్దరు ఎవరు? వారు వీరి బంధువులా కాదా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ​ఘటన తీవ్రత దృష్ట్యా నల్లగొండ అదనపు ఎస్పీ (Addl SP) జి. రమేష్ క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించారు. ​"ఇది ఆత్మహత్యా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. పూర్తి విచారణ జరిపి త్వరలోనే అసలు నిజాలను వెల్లడిస్తామని అని అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. ​ఈ దారుణ ఘటనతో తెలంగాణ కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Sthanikam

నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News