Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 07:25 PM

క్వారీ, క్రషర్‌పై సిరిపురం ప్రజల పోరు. కలెక్టర్‌కు గ్రామస్థులు, రైతులు, అఖిలపక్ష నేతల వినతి.

22-06-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఏకగ్రీవ తీర్మానం.. సంతకాలతో ఫిర్యాదు.

రామన్నపేట: సిరిపురం గ్రామ సమీపంలో ప్రతిపాదిత క్వారీ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న సిరి మెటల్ ప్రొడక్ట్స్ క్రషర్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా గ్రామస్థులు, రైతులు, అఖిలపక్ష నాయకులు ఒక్కటయ్యారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కథనాల నేపథ్యంలో అప్రమత్తమైన గ్రామ ప్రజలు ఆదివారం సమావేశమై క్వారీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

క్వారీ, క్రషర్ కార్యకలాపాల వల్ల దుమ్ము, శబ్ద కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, వ్యవసాయ భూములు, భూగర్భ జలాలు, తాగునీటి వనరులు దెబ్బతింటాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సిరిపురం, వెల్లంకి, పెద్దకాపర్తి, వెలిమినేడు గ్రామాల ప్రజలు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా క్వారీకి అనుమతులు మంజూరు చేయవద్దని, ప్రస్తుతం కొనసాగుతున్న క్రషర్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని కలెక్టర్‌ను కోరారు. గ్రామాభివృద్ధి, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పున్నా వెంకటేశం, బడుగు రమేష్, ఎల్లా సంజీవరెడ్డి, గుంటోజు కృష్ణమాచారి, కునూరు గణేష్, కునూరు లింగస్వామి, రాపోలు విశ్వనాథం, ఎల్లా వెంకటనర్సింహ, గజం సత్యం, బడుగు యాదగిరి, బల్గిరి ఉపేందర్, సిల్వేరు లక్ష్మయ్య, రామలక్ష్మయ్య, దయ్యాల మల్లయ్య, బల్గిరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్వారీ, క్రషర్‌పై సిరిపురం ప్రజల పోరు. కలెక్టర్‌కు గ్రామస్థులు, రైతులు, అఖిలపక్ష నేతల వినతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News