Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 07:27 PM

విద్యార్థులే నిర్వహించిన బాలసభ ఆకట్టుకుంది జడ్పీహెచ్‌ఎస్ కోహెడలో సృజనాత్మక ప్రదర్శనలు

22-06-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోహెడ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోహెడలో నిర్వహించిన బాలసభ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతకు అద్దం పట్టింది. విద్యార్థులే స్వయంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్. తిరుపతిబాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మీలా విజయ్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమం ప్రారంభంలో ఆరవ తరగతి విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం విద్యార్థులు దేశభక్తి గేయాలు, పాటలు, ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలు, వినోదాత్మక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పాటలు, నృత్యాలు విశేషంగా అలరించాయి.

బాలసభ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వేదికపై మాట్లాడే నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు "మీలా శ్రీయ" తరఫున బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎన్. తిరుపతిబాయి మాట్లాడుతూ.. విద్యార్థులే కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమన్వయ నైపుణ్యాలను పెంపొందిస్తాయని అన్నారు.

కార్యక్రమ విజయవంతానికి ఉపాధ్యాయులు ఉమామహేశ్వరి, లక్ష్మణ్, గోపాల్ రెడ్డి, రాధా మాధవి, కొండయ్య, చంద్రమోహన్, గణేష్ తదితరులు సహకరించారు.

Sthanikam

విద్యార్థులే నిర్వహించిన బాలసభ ఆకట్టుకుంది జడ్పీహెచ్‌ఎస్ కోహెడలో సృజనాత్మక ప్రదర్శనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News