Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

*దేవాదాయ శాఖ డైరెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి సామాజిక కార్యకర్తలు

22-06-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఇటీవల తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ గా పదోన్నతి పై వెళ్ళిన ఎం. హనుమంతరావు ను సోమవారం హైదరాబాద్ లోని కార్యాలయంలో భువనగిరి కి చెందిన సామాజిక కార్యకర్తలు బర్రె సుదర్శన్, నల్ల కృష్ణ లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శాలువా, మెమెంటో లతో ఎండోమెంట్ డైరెక్టర్ ఎం. హనుమంతరావు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న , ముఖ్యంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో పనిచేస్తున్న ఎస్సీ/ ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పదోన్నతి విషయంలో పారదర్శకత పాటించాలని బర్రె సుదర్శన్ డైరెక్టర్ ను కోరారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ హనుమంతరావు ఆత్మీయంగా ఆహ్వానించారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ముఖ్యంగా ఎస్సీ/ ఎస్టీ ల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు బర్రె సుదర్శన్ మీడియాతో తెలిపారు.

Sthanikam

*దేవాదాయ శాఖ డైరెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి సామాజిక కార్యకర్తలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఇటీవల తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ గా పదోన్నతి పై వెళ్ళిన ఎం. హనుమంతరావు ను సోమవారం హైదరాబాద్ లోని కార్యాలయంలో భువనగిరి కి చెందిన సామాజిక కార్యకర్తలు బర్రె సుదర్శన్, నల్ల కృష్ణ లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శాలువా, మెమెంటో లతో ఎండోమెంట్ డైరెక్టర్ ఎం. హనుమంతరావు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న , ముఖ్యంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో పనిచేస్తున్న ఎస్సీ/ ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, పదోన్నతి విషయంలో పారదర్శకత పాటించాలని బర్రె సుదర్శన్ డైరెక్టర్ ను కోరారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ హనుమంతరావు ఆత్మీయంగా ఆహ్వానించారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ముఖ్యంగా ఎస్సీ/ ఎస్టీ ల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు బర్రె సుదర్శన్ మీడియాతో తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News