Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ.

22-06-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువత మేలుకో.. డ్రగ్స్ మానుకో.

రామన్నపేట

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సోమవారం మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఎస్ ఐ నాగరాజు, కళాశాల ప్రిన్సిపల్ సి. జగదీష్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.

బిగ్ టీవీ వ్యాఖ్యాత నీలా నరసన్న తనదైన శైలిలో పాటలు, సందేశాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. ‘యువత మేలుకో–డ్రగ్స్ మానుకో’, ‘డ్రగ్స్ వద్దు–ఆరోగ్యం ముద్దు’, ‘డ్రగ్స్ మానుకో–జీవితాన్ని మలుచుకో’ వంటి నినాదాలతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు ఉప్పల నరసింహారావు, దొడ్డి అశోక్‌కుమార్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Sthanikam

జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News