నల్గొండలో విక్టోరిస్ ఎడ్జ్ ఎడిషన్ సందడి. వాహన ప్రియులకు మారుతి కొత్త కానుక
నల్గొండలో విక్టోరిస్ ఎడ్జ్ ఎడిషన్ సందడి. వాహన ప్రియులకు మారుతి కొత్త కానుక
Editor Desk
నల్గొండ: వాహన ప్రియులను ఆకట్టుకునేలా మారుతి సుజుకి సరికొత్త విక్టోరిస్ ఎడ్జ్ ఎడిషన్ను నల్గొండలో ఆవిష్కరించింది. నగరంలోని మారుతి సుజుకి అరేనా అధీకృత డీలర్ పవన్ మోటార్స్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి వాహనాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదు స్టార్ భద్రతా రేటింగ్‌తో పాటు అత్యంత వేగంగా లక్ష వాహనాల విక్రయాలను సాధించిన మోడల్‌గా విక్టోరిస్ గుర్తింపు పొందిందన్నారు. 2026 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక కావడం ఈ వాహనం ప్రత్యేకత అని తెలిపారు.
ఎడ్జ్ ఎడిషన్‌లో ఆకర్షణీయమైన బ్లాక్డ్-అవుట్ స్టైలింగ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ స్పాయిలర్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మారుతి సుజుకి నిరంతరం వినూత్న మోడళ్లను అందిస్తోందన్నారు.
ప్రత్యేక లాంచ్ ఆఫర్లు, టెస్ట్ డ్రైవ్‌ల కోసం వినియోగదారులు చెర్లపల్లి, అద్దంకి బైపాస్ రోడ్డులోని పవన్ మోటార్స్‌ను సందర్శించాలని కోరారు. విక్టోరిస్ ఎడ్జ్ ఎడిషన్ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు తెలిపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు జానకి గుమ్మల మోహన్ రెడ్డి, బొజ్జ శంకరయ్య, దొడ్డి రమేష్, పేరిక స్వాతి వినాయక్ రాజ్, సీసీఓ కందల రవి రెడ్డి, జీఎం నాగమణి, సంస్థ ప్రతినిధులు, వినియోగదారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి