Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్లగొండలో ఘోరం: ఒకే ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు! పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 10:19 PM

ఉప సర్పంచ్‌ల హక్కులను కాపాడాలి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేత

ఉప సర్పంచ్‌ల హక్కులను కాపాడాలి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేత

ఉప సర్పంచ్‌ల హక్కులను కాపాడాలి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేత
June 22, 2026 08:31 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చెక్ పవర్ రద్దు వార్తలపై ఆందోళన

గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణకు, స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చౌటుప్పల్ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బోట్ల కార్తీక్, రాష్ట్ర కార్యదర్శి చిన్నం బాలరాజుల ఆదేశాల మేరకు.. చౌటుప్పల్ మండల ఫోరం అధ్యక్షుడు బొమ్మకంటి కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ప్రజాప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

​ఇటీవల కొన్ని సోషల్ మీడియా వేదికలు, టెలివిజన్ ఛానళ్లలో ఉప సర్పంచ్‌ల చెక్కు సంతకం అధికారాలను రద్దు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఉప సర్పంచ్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉప సర్పంచ్‌లకు ప్రస్తుతం ఉన్న హక్కులు, అధికారాలను యథాతథంగా కొనసాగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు.​గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక భద్రత లేకపోవడం శోచనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న తమకు గౌరవప్రదమైన నెలవారీ వేతనాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ​ఉప సర్పంచ్‌ల వినతిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సమస్యలు న్యాయమైనవని.. వీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ స్థాయిలో చర్చించి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, మండల ఉపాధ్యక్షులు బాతరాజు ధనుంజయ్, మండల ప్రధాన కార్యదర్శి బోయ సదానందం, వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల సురేందర్ రెడ్డి, మండలంలోని ఉప సర్పంచ్‌లు ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి, గడ్డం సత్యం, ఉప్పునూతల నరసింహ, పెరుమాండ్ల లింగస్వామి, ప్రభాకర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News