Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:08 PM

సమస్య చెప్పండి... పరిష్కారం మా బాధ్యత: ప్రజలకు ఎస్పీ భరోసా

22-06-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లలో పరిష్కారం కాని సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, త్వరితగతిన న్యాయం అందించడమే సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవాభావంతో పనిచేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు.

Sthanikam

సమస్య చెప్పండి... పరిష్కారం మా బాధ్యత: ప్రజలకు ఎస్పీ భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News