Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:19 PM

విద్యార్థుల అభ్యున్నతికి మాజీ అడిషనల్ ఎస్పీ బాలరాజ్ సహకారం

22-06-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండల పరిధిలోని షెల్గెరా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మాజీ అడిషనల్ ఎస్పీ బాలరాజ్ (మణికొండ, హైదరాబాద్) తన దాతృత్వాన్ని చాటుకుంటూ పాఠశాలలోని 125 మంది విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి రాజశేఖర్, జెడ్పిహెచ్ఎస్ శేల్గిరా ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేష్ కుమార్, ఉపాధ్యాయులు నర్సింలు, రాములు, విట్టల్, ప్రశాంతి, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యనే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే ప్రతి సహాయం దేశ భవిష్యత్తుకు పెట్టుబడితో సమానమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి చేయూతనందించిన బాలరాజ్ సేవాభావాన్ని కొనియాడుతూ, ఆయన చేపట్టిన ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమం మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ముందుకు వచ్చి సహకరించిన బాలరాజ్‌కు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

విద్యార్థుల అభ్యున్నతికి మాజీ అడిషనల్ ఎస్పీ బాలరాజ్ సహకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News