Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:13 PM

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. యువతకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

22-06-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించిన ఆయన, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీసి కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, ప్రజల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఎస్సై కావేరి, ఎస్-ఎన్‌వైఏబీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. యువతకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

Article Image

జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించిన ఆయన, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీసి కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, ప్రజల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఎస్సై కావేరి, ఎస్-ఎన్‌వైఏబీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News