Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

"అంబుజాకు బ్రేక్.. వీరేశానికి పాలాభిషేక్". "ఫ్యాక్టరీకి ఫుల్‌స్టాప్.. కాంగ్రెస్ సంబరాలు"

22-06-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు కాకుండా కృషి చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చిత్రపటానికి సోమవారం రామన్నపేట పట్టణ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సుభాష్ సెంటర్ నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాలుష్య కారకమైన అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా రామన్నపేట, కోమ్మాయిగూడెం, సిరిపురం, వెల్లంకి, బోగారం, పెద్దకాపర్తి తదితర గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు చేపట్టిన పోరాటానికి ఎమ్మెల్యే వేముల వీరేశం అండదండగా నిలిచారని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ ఏర్పాటు కాకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుతో కాలుష్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించి వారి ప్రయోజనాలను కాపాడారని పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటు నిలిచిపోవడంతో రామన్నపేట ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని, తమకు ప్రజల కోసం పోరాడే నాయకుడు ఉన్నారనే విశ్వాసం మరింత పెరిగిందన్నారు.

ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ఎమ్మెల్యే చూపిన చొరవకు గుర్తింపుగా పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

"అంబుజాకు బ్రేక్.. వీరేశానికి పాలాభిషేక్". "ఫ్యాక్టరీకి ఫుల్‌స్టాప్.. కాంగ్రెస్ సంబరాలు"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News