Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో ఆధ్వర్యంలో ధర్నా

22-06-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : ఆదోనిలోని నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నారాయణ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, పీడీఎస్‌వో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ.. స్కూల్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాంలు తదితర పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్ సమయంలో ఒక విధంగా ఫీజులు చెబుతూ, తర్వాత వివిధ రకాల పేర్లతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

విద్యను వ్యాపారంగా మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. పుస్తకాలు, యూనిఫాంలను తమ వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లపై విచారణ జరపాలని, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో అదనపు వసూళ్లను నిలిపివేయాలని, ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sthanikam

నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో ఆధ్వర్యంలో ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News