Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 AM

సొంత నిధులతో నోట్ బుక్స్ అందజేసిన సర్పంచ్.

22-06-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం తాళ్ల వెల్లంల ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్ తన సొంత నిధులతో విద్యార్థులకు కాపీ రైటింగ్ నోట్‌బుక్స్, పుస్తకాలను సోమవారం అందజేశారు. విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో రూ.16 వేల రూపాయల విలువైన నోట్‌బుక్స్‌ను కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జోగు సురేష్ మాట్లాడుతూ, గ్రామంలోని విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సర్పంచ్ చేసిన సహాయాన్ని అభినందించారు. విద్యార్థులు కూడా నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పామునుగుల్ల సునీత-బుచ్చిరాములు, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

Sthanikam

సొంత నిధులతో నోట్ బుక్స్ అందజేసిన సర్పంచ్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News