గంజాయి,డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించిన; ఎస్సై
గంజాయి,డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించిన; ఎస్సై
Bandi Kiran Kumar
అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం జూన్ 26 సందర్భంగా జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు తుంగతుర్తి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాటశాలో పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన, గంజాయి నిర్మూలన పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ మాధక ద్రవ్యాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం జూన్ 26 సందర్భంగా మండల పరిధిలో వారం రోజులపాటు డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థి దశ నుంచే గంజాయి లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసే వ్యసనాల బారిన పడకూడదని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు. గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలు వాడినా, విక్రయించినా లేదా రవాణా చేసినా చట్టపరంగా ఎదురయ్యే కఠినమైన శిక్షలను తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
విద్యార్థులు కేవలం చదువు, క్రీడలపైనే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఎవరైనా మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు డయల్ 100, 112 కు, తెలంగాణ రాష్ట్ర ఈగల్ పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1908 కి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడుతాయని తెలిపారు. మత్తుపదార్థాల రహిత సమాజ స్థాపనకు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా యాంటీ డ్రగ్స్ సోల్జర్* సెల్ఫీ స్టిక్.. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో యాంటీ డ్రగ్ సోల్జర్ సెల్ఫీ స్టిక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు మేము సైతం మాదాకద్రవ్యాల నిర్మూలన సైనికులుగా ఉంటామని సెల్ఫీ స్టిక్ వద్ద ఫోటోలు దిగి పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM), ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి