Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

నారాయణ స్కూల్‌లో పుస్తకాల దోపిడీపై డీవైఎఫ్‌ఐ ఆందోళన అధిక ధరలకు పుస్తకాల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

30-06-2026 359 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్, జూన్ 30:

నకిరేకల్‌లోని నారాయణ స్కూల్‌లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ డీవైఎఫ్‌ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తోందని వారు విమర్శించారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ, విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోచుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల పేరుతో విద్యార్థుల కుటుంబాలపై అదనపు భారం మోపడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పాఠశాలలో జరుగుతున్న పుస్తకాల విక్రయాలపై విచారణ నిర్వహించి, అధిక ధరల వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, కార్యదర్శి ముసుకు రవీందర్, డీవైఎఫ్‌ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, నాయకులు బొడ్డుపల్లి నరేష్, శశికుమార్, శివప్రసాద్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ స్కూల్‌లో పుస్తకాల దోపిడీపై డీవైఎఫ్‌ఐ ఆందోళన అధిక ధరలకు పుస్తకాల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Article Image

నకిరేకల్, జూన్ 30:

నకిరేకల్‌లోని నారాయణ స్కూల్‌లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ డీవైఎఫ్‌ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తోందని వారు విమర్శించారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ, విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోచుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల పేరుతో విద్యార్థుల కుటుంబాలపై అదనపు భారం మోపడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పాఠశాలలో జరుగుతున్న పుస్తకాల విక్రయాలపై విచారణ నిర్వహించి, అధిక ధరల వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, కార్యదర్శి ముసుకు రవీందర్, డీవైఎఫ్‌ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, నాయకులు బొడ్డుపల్లి నరేష్, శశికుమార్, శివప్రసాద్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News