Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:30 PM

ఒక్క అర్హ ఓటరూ జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలి: సిద్ధార్థ నాయుడు

30-06-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని పట్టణంలోని 26వ వార్డు వెంకన్నపేట, నారాయణగుంత ప్రాంతాల్లో కొనసాగుతున్న SIR ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సూచనల మేరకు, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదేశాల ప్రకారం యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా BLO అధికారులతో మాట్లాడిన నాయకులు, ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ పురోగతి, ఇంటింటి సర్వే పూర్తి స్థాయిలో జరుగుతోందా, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అవుతున్నాయా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

అలాగే అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి నిబంధనల ప్రకారం పారదర్శకంగా వెరిఫికేషన్ నిర్వహించాలని BLO అధికారులకు సూచించారు. ప్రజలు కూడా వెరిఫికేషన్ సమయంలో అధికారులకు పూర్తి సహకారం అందించి, అవసరమైన పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, శివ, రవి, సిద్ధ, శాంతమూర్తి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఒక్క అర్హ ఓటరూ జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలి: సిద్ధార్థ నాయుడు

Article Image

ఆదోని పట్టణంలోని 26వ వార్డు వెంకన్నపేట, నారాయణగుంత ప్రాంతాల్లో కొనసాగుతున్న SIR ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సూచనల మేరకు, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదేశాల ప్రకారం యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా BLO అధికారులతో మాట్లాడిన నాయకులు, ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ పురోగతి, ఇంటింటి సర్వే పూర్తి స్థాయిలో జరుగుతోందా, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అవుతున్నాయా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

అలాగే అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి నిబంధనల ప్రకారం పారదర్శకంగా వెరిఫికేషన్ నిర్వహించాలని BLO అధికారులకు సూచించారు. ప్రజలు కూడా వెరిఫికేషన్ సమయంలో అధికారులకు పూర్తి సహకారం అందించి, అవసరమైన పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, శివ, రవి, సిద్ధ, శాంతమూర్తి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News