Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:19 AM

"నేను రూ.50 వేలే ఇవ్వగలను.. రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు"

29-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మునుగోడులో మంత్రి వెంకట్ రెడ్డి సరదా వ్యాఖ్యలు.. నవ్వుల్లో మునిగిన సభ.

మునుగోడులో నిర్వహించిన కార్యక్రమంలో ఓ మహిళకు ప్రభుత్వం తరఫున రూ.50 వేల ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. తన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదార స్వభావాన్ని ప్రస్తావిస్తూ మంత్రి చేసిన చమత్కార వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సహాయం అందజేసిన అనంతరం మాట్లాడిన మంత్రి వెంకట్ రెడ్డి, "నా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు. ఆయన ఉండగా నేనేం చేయగలను. నా దగ్గర డబ్బులు ఏం లేవు. నేనే గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నా. నేనైతే రూ.50 వేల సాయం చేస్తా. అదే రాజగోపాల్ రెడ్డిని అడుగు.. అన్ని చూసుకుంటాడు" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

మంత్రి మాటలతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. రాజకీయ ప్రసంగాల మధ్యలో వచ్చిన ఈ హాస్యభరిత వ్యాఖ్యలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కోమటిరెడ్డి సోదరుల మధ్య ఉన్న అనుబంధాన్ని, రాజగోపాల్ రెడ్డి సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశంగా మారగా, వీడియోలు సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

మునుగోడు రాజకీయాల్లో తరచూ వార్తల్లో నిలిచే కోమటిరెడ్డి సోదరులు, ఈసారి మాత్రం తమ సరదా సంభాషణతో ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించారు. "రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు" అంటూ మంత్రి చేసిన వ్యాఖ్య ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.

Sthanikam

"నేను రూ.50 వేలే ఇవ్వగలను.. రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News