Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాల అందజేత

29-06-2026 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కమిటీ సభ్యుల సమావేశం ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్, జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్, జాతీయ కమిటీ సభ్యుడు వి. వెంకటేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సంఘం రాష్ట్ర కమిటీ నియామకాలను ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బైండ్ల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా మన్నే నాగేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మన్నే పోచయ్య, రాష్ట్ర సలహాదారుగా బేగరి సంగమేశ్వర్‌లను నియమించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ నూతనంగా నియమితులైన రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పదాధికారులు తమపై ఉంచిన నమ్మకానికి జాతీయ కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు.

Sthanikam

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాల అందజేత

Article Image

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కమిటీ సభ్యుల సమావేశం ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్, జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్, జాతీయ కమిటీ సభ్యుడు వి. వెంకటేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సంఘం రాష్ట్ర కమిటీ నియామకాలను ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బైండ్ల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా మన్నే నాగేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మన్నే పోచయ్య, రాష్ట్ర సలహాదారుగా బేగరి సంగమేశ్వర్‌లను నియమించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ నూతనంగా నియమితులైన రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పదాధికారులు తమపై ఉంచిన నమ్మకానికి జాతీయ కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News