Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:48 AM

బాలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలి: డీఈవో భిక్షపతి.

29-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి

గతంలో మూతపడిన భువనగిరి మండలం బాలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) బొల్లారం భిక్షపతి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులతో పాటు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. పునఃప్రారంభమైన పాఠశాలకు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల నియామకం తదితర ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని మండల విద్యాధికారిని ఆదేశించారు.

గ్రామ సర్పంచ్ శ్రీరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, మండల విద్యాధికారి ఆర్. రంగరాజన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎన్. అండాలు, ఉపసర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు, సీఆర్‌పీ అన్నపూర్ణ, అంగన్‌వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలి: డీఈవో భిక్షపతి.

Article Image

భువనగిరి

గతంలో మూతపడిన భువనగిరి మండలం బాలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) బొల్లారం భిక్షపతి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులతో పాటు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. పునఃప్రారంభమైన పాఠశాలకు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల నియామకం తదితర ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని మండల విద్యాధికారిని ఆదేశించారు.

గ్రామ సర్పంచ్ శ్రీరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, మండల విద్యాధికారి ఆర్. రంగరాజన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎన్. అండాలు, ఉపసర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు, సీఆర్‌పీ అన్నపూర్ణ, అంగన్‌వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News