Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 PM

వెలిమినేడు పాల సంఘం డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా.. భారీ మెజారిటీతో గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి విజయం

28-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 28:

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పాల సంఘం డైరెక్టర్ పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు బరిలో నిలవగా, పాడి రైతుల మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని విజయోత్సాహాన్ని పంచుకున్నారు. పాల సంఘం అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని విజేత గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసే నాయకత్వానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, రైతుల విశ్వాసంతో సాధించిన ఈ విజయం పాల సంఘం అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు.విజయోత్సవ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అరూరి శ్రీశైలం, నాయకులు దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాతి శ్రీనివాస్, పైళ్ల రఘుమారెడ్డి, చిర్రబోయిన సురేష్, దేవిరెడ్డి సందీప్ రెడ్డి, బైకాని నరసింహ, దాసరి అయిలయ్య, వార్డు సభ్యులు ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, గోలి అంజయ్య, పంది మణికంఠతో పాటు పార్టీ కార్యకర్తలు, పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వెలిమినేడు పాల సంఘం డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా.. భారీ మెజారిటీతో గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి విజయం

Article Image

చిట్యాల, జూన్ 28:

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పాల సంఘం డైరెక్టర్ పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు బరిలో నిలవగా, పాడి రైతుల మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని విజయోత్సాహాన్ని పంచుకున్నారు. పాల సంఘం అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని విజేత గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసే నాయకత్వానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, రైతుల విశ్వాసంతో సాధించిన ఈ విజయం పాల సంఘం అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు.విజయోత్సవ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అరూరి శ్రీశైలం, నాయకులు దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాతి శ్రీనివాస్, పైళ్ల రఘుమారెడ్డి, చిర్రబోయిన సురేష్, దేవిరెడ్డి సందీప్ రెడ్డి, బైకాని నరసింహ, దాసరి అయిలయ్య, వార్డు సభ్యులు ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, గోలి అంజయ్య, పంది మణికంఠతో పాటు పార్టీ కార్యకర్తలు, పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News