Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 PM

గుండ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

28-06-2026 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగిన వరుస వాహనాల ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మూడు కార్లు, ఒక బైక్ పరస్పరం ఢీకొన్న ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మృతులను నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి దేవేందర్ రెడ్డి మరియు దేప సరితగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నట్లు, వారిలో పలువురికి గాయాలైనట్లు తెలిసింది. సడన్ బ్రేక్ వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా, స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

గుండ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

Article Image

చిట్యాల, జూన్ 28: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగిన వరుస వాహనాల ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మూడు కార్లు, ఒక బైక్ పరస్పరం ఢీకొన్న ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మృతులను నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి దేవేందర్ రెడ్డి మరియు దేప సరితగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నట్లు, వారిలో పలువురికి గాయాలైనట్లు తెలిసింది. సడన్ బ్రేక్ వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా, స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News