Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:31 PM

వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం

28-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నెలకొన్న నీటి కొరతపై ఇటీవల వెలువడిన వార్తలకు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 26న పలు పత్రికల్లో "భువనగిరి కేజీబీవీలో నీటి కొరత" అనే కథనం ప్రచురితమైన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించారు. వెంటనే మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల ఆవరణలో చెడిపోయిన బోరును అత్యవసరంగా మరమ్మతులు చేయాలని ప్రత్యేక అధికారి చంద్రకళకు సూచించారు.

ఆదేశాల మేరకు ఆదివారం బోరు మరమ్మతు పనులు పూర్తి చేశారు. అలాగే హుస్సేనాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ మర్రి పాండు యాదవ్ చొరవతో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి, కేజీబీవీ పాఠశాల–కళాశాలకు 24 గంటల నీటి సరఫరా అందేలా శాశ్వత కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.

సమస్యను వేగంగా పరిష్కరించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు కేజీబీవీ విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయమని వారు పేర్కొన్నారు

Sthanikam

వార్తకు స్పందించిన అధికారులు.. భువనగిరి కేజీబీవీలో నీటి సమస్యకు పరిష్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News