Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:23 PM

ఉద్యోగాలు అడిగితే అరెస్టులా?.. డివైఎఫ్ఐ ఆగ్రహం

28-06-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డివైఎఫ్ఐ నాయకులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్న నాయకులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

నిరుద్యోగ యువత తరఫున ఉద్యోగాల కోసం ప్రశ్నించడం నేరం కాదని, పోరాటం చేస్తున్న యువజన నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే గొంతులను అణిచివేసే చర్యలకు పాల్పడడం సరికాదన్నారు.

రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నందున వాటిని వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల హామీలను అమలు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. అలాగే అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, ఇటువంటి అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

Sthanikam

ఉద్యోగాలు అడిగితే అరెస్టులా?.. డివైఎఫ్ఐ ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News