Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:00 PM

పల్స్ పోలియో ప్రతి బిడ్డకు రక్షణ కవచం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

28-06-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక బస్టాండ్ ఆవరణతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ... ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ఈ చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయని పేర్కొన్నారు. పట్టణంలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా ఉండిపోకూడదని, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పాక చిరంజీవి, చింతల ఉమామహేశ్వరి సాయిలు, ఎండి హను బాయ్, బత్తుల జయమ్మ దాస్, ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ సుమన్ కళ్యాణ్, కాటమరాజు, పాండురంగారావు, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పల్స్ పోలియో ప్రతి బిడ్డకు రక్షణ కవచం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News