Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్

28-06-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమం ప్రారంభం

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నేలపట్ల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో మహమ్మారిని దేశం నుండి తరిమికొట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని గ్రామంలో వంద శాతం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య గౌడ్, టీడీపి పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు తడక కోటేశ్వర్, చౌట సంపత్ కుమార్, స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News