Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

రామన్నపేటలో సౌర విప్లవానికి శ్రీకారం. పీఎం కుసుమ్‌తో రైతులకు సౌరశక్తి వరం.

28-06-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో పీఎం కుసుమ్ పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఆదివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ సురేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్లింకో ఎనర్జీ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మనోడి మాట్లాడుతూ, సౌర విద్యుత్ ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తెలంగాణలో తొలి సౌర విద్యుత్ ప్లాంట్‌ను రామన్నపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

రాబోయే రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 10 నుంచి 15 సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈపీసీ భాగస్వామ్యంతో స్లింకో ఎనర్జీ ఇంజినీరింగ్ సంస్థ పూర్తి స్థాయి సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టులను అమలు చేసిందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్లాంట్ యజమానులు జీవన్‌రెడ్డి, పద్మారావును అధికారులు అభినందించారు.

కార్యక్రమంలో చౌటుప్పల్ డీఈ మల్లికార్జున్, ఎంఆర్టీ డీఈ విజయభాస్కర్, ఏడీఈ శ్రీకాంత్, ఏఈ కోటేశ్వరరావు, సబ్‌స్టేషన్ సిబ్బంది, ప్రాజెక్ట్ డెవలపర్లు, స్లింకో ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో సౌర విప్లవానికి శ్రీకారం. పీఎం కుసుమ్‌తో రైతులకు సౌరశక్తి వరం.

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో పీఎం కుసుమ్ పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఆదివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ సురేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్లింకో ఎనర్జీ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మనోడి మాట్లాడుతూ, సౌర విద్యుత్ ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తెలంగాణలో తొలి సౌర విద్యుత్ ప్లాంట్‌ను రామన్నపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

రాబోయే రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 10 నుంచి 15 సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈపీసీ భాగస్వామ్యంతో స్లింకో ఎనర్జీ ఇంజినీరింగ్ సంస్థ పూర్తి స్థాయి సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టులను అమలు చేసిందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్లాంట్ యజమానులు జీవన్‌రెడ్డి, పద్మారావును అధికారులు అభినందించారు.

కార్యక్రమంలో చౌటుప్పల్ డీఈ మల్లికార్జున్, ఎంఆర్టీ డీఈ విజయభాస్కర్, ఏడీఈ శ్రీకాంత్, ఏఈ కోటేశ్వరరావు, సబ్‌స్టేషన్ సిబ్బంది, ప్రాజెక్ట్ డెవలపర్లు, స్లింకో ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News