Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:31 PM

దళితవాడల సమస్యలపై క్షేత్రస్థాయి సర్వే. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతులు.

28-06-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని కక్కిరేణి గ్రామంలోని దళితవాడల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. జీవన పరిస్థితులు, సామాజిక వివక్ష, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుందం, మండల కార్యదర్శి కందుల హనుమంతు మాట్లాడుతూ.. ఎస్సీ కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల భద్రత కోసం ఎస్సీ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ హాలుకు ప్రహరీ గోడ నిర్మించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. భూమిలేని పేద కుటుంబాలకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

దళితవాడల్లోని సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు వేముల సైదులు, అనిత, నరేష్, నీరజ, దేవేందర్, ముత్తమ్మ, మాతమ్మ, నరసింహ, కవిత తదితరులు పాల్గొన్నారు

Sthanikam

దళితవాడల సమస్యలపై క్షేత్రస్థాయి సర్వే. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతులు.

Article Image

రామన్నపేట మండలం లోని కక్కిరేణి గ్రామంలోని దళితవాడల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. జీవన పరిస్థితులు, సామాజిక వివక్ష, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుందం, మండల కార్యదర్శి కందుల హనుమంతు మాట్లాడుతూ.. ఎస్సీ కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల భద్రత కోసం ఎస్సీ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ హాలుకు ప్రహరీ గోడ నిర్మించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. భూమిలేని పేద కుటుంబాలకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

దళితవాడల్లోని సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు వేముల సైదులు, అనిత, నరేష్, నీరజ, దేవేందర్, ముత్తమ్మ, మాతమ్మ, నరసింహ, కవిత తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News