Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

జూలై 2న తలపెట్టిన చలో ఉప్పల్ భగాయత్ కు తరలి రావాలి.

28-06-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో ఉప్పల్ భగాయత్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ బండారి మహేందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం కోదాడ పట్నంలోని కొమరం భీమ్ ఆడిటోరియం ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవితమ్మ చేస్తున్న పోరాటానికి అందరు మద్దతు పలకాలన్నారు.ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మూడేళ్లు కావస్తున్నా నీటి వరకు అమలు కాలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం 28 వేల పెన్షన్, స్వతంత్ర సమరయోధుల గుర్తింపు కార్డులు వంటి హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదు అన్నారు. ఉప్పల్ భగాయత్ లో 350 ఎకరాల భూమి ఉందని ఉద్యమకారులకు పంచాలని తమ అధినేత కవితక్క జూలై 2న చేపట్టిన ఈ ఉద్యమానికి కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గం నుండి వందలాది మంది ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు.కవితక్క నాయకత్వంలో ఉద్యమకారుల హక్కులన్నీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్, కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ సంజీవ నాయక్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి లాజర్ నాయక్ మురళి నాయక్ ఉన్నారు.

Sthanikam

జూలై 2న తలపెట్టిన చలో ఉప్పల్ భగాయత్ కు తరలి రావాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News