Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:32 PM

సిరిపురంలో 'సిరి కన్స్ట్రక్షన్స్' ప్రారంభం. స్వయం ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యేలు

28-06-2026 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

.రామన్నపేట,

రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'సిరి కన్స్ట్రక్షన్స్' సంస్థను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్, స్వయం ఉపాధి పథకాల ద్వారా యువతకు అండగా నిలుస్తోందన్నారు. సిరి కన్స్ట్రక్షన్స్ వంటి సంస్థలు స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు.

సంస్థ యాజమాన్యాన్ని ఎమ్మెల్యేలు అభినందిస్తూ, నాణ్యమైన నిర్మాణ సామగ్రి, సేవలను ప్రజలకు అందించి సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సిరిపురం గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిరిపురంలో 'సిరి కన్స్ట్రక్షన్స్' ప్రారంభం. స్వయం ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యేలు

Article Image

.రామన్నపేట,

రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'సిరి కన్స్ట్రక్షన్స్' సంస్థను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్, స్వయం ఉపాధి పథకాల ద్వారా యువతకు అండగా నిలుస్తోందన్నారు. సిరి కన్స్ట్రక్షన్స్ వంటి సంస్థలు స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు.

సంస్థ యాజమాన్యాన్ని ఎమ్మెల్యేలు అభినందిస్తూ, నాణ్యమైన నిర్మాణ సామగ్రి, సేవలను ప్రజలకు అందించి సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సిరిపురం గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News