Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలి

ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలి

ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలి
28-06-2026 251 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నూతనంగా ‘ఆరాధ్య హోటల్‌’ ప్రారంభం

13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్

ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, వినియోగదారుల మన్ననలు పొందాలని చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ సూచించారు. మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డు పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఆరాధ్య హోటల్‌'ను ఆదివారం ఆమె ప్రారంభించారు.​ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. హోటళ్లలో ఆహార పదార్థాల తయారీలో రుచితో పాటు శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహారాన్ని అందించినప్పుడే వ్యాపారాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు. నూతన హోటల్ యజమాని సతీష్‌కు ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హోటల్ నిర్వాహకులు కౌన్సిలర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.​ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్లు ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, కొయ్యడ శేఖర్ గౌడ్, కో-ఆప్షన్ మెంబర్ సందగళ్ళ విజయ సతీష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నాయకులు చెవగోని వెంకటేష్ గౌడ్, వర్కాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News