Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:33 PM

కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.

29-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పెండింగ్‌లో ఉన్న నిర్మాణ, మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేసి విద్యార్థినులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతితో కలిసి కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పూర్తికాని పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కాంపౌండ్ వాల్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా గడువులోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కేజీబీవీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.

Article Image

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పెండింగ్‌లో ఉన్న నిర్మాణ, మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేసి విద్యార్థినులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతితో కలిసి కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పూర్తికాని పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కాంపౌండ్ వాల్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా గడువులోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News