Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

సై లార్క్ ఆసుపత్రి మరో ఘన విజయం.. తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స సఫలం

Updated : 29 Jun 2026 19:55 IST
As Preferred Source 1 min read
సై లార్క్ ఆసుపత్రి మరో ఘన విజయం.. తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స సఫలం

ఉమ్మడి మెదక్ జిల్లాలోని వెనుకబడిన నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు ఇప్పటివరకు మెరుగైన వైద్య సేవల కోసం బీదర్, సంగారెడ్డి, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. అత్యవసర పరిస్థితుల్లో కూడా దూర ప్రాంతాలకు ప్రయాణించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే ఇప్పుడు నారాయణఖేడ్‌లోని సై లార్క్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ఎంతో ఊరట లభిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ పి. రోహిత్ రాథోడ్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల వృద్ధురాలికి పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిత్ రాథోడ్ మాట్లాడుతూ నారాయణఖేడ్ వంటి మారుమూల ప్రాంతంలోనే ఈ తరహా శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలకు సువర్ణ అవకాశమని, ఇకపై మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సై లార్క్ ఆసుపత్రిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసుపత్రిలో నిర్వహించిన తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడానికి సహకరించిన వైద్యులు, నిర్వహణ బృందం, ఆసుపత్రి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివ, నిర్వహణ సంచాలకుడు బేమర రవికిరణ్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సై లార్క్ ఆసుపత్రి మరో ఘన విజయం.. తొలి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స సఫలం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news