Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

భూ వివాదం బలిగొన్న బంధం.. తల్లిని హత్య చేసి కుమారుడు ఆత్మహత్య

29-06-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెద్దరావులపల్లిలో విషాద ఘటన.. గ్రామంలో తీవ్ర కలకలం

భూదాన్ పోచంపల్లి, జూన్ 29:

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ బంధాలను మరిచిపోయేలా జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

గ్రామస్తులు, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు గ్రామానికి చెందిన సంగం శ్రీనివాస్ తన తల్లి సంగం పోచమ్మను రాయితో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం తాను ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తల్లి, కుమారుడు మృతదేహాలు ఒకే ఇంట్లో కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ప్రాథమిక విచారణలో భూ వివాదమే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు.

ఈ ఘటనతో పెద్దరావులపల్లి గ్రామం విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రావొద్దని పేర్కొన్నారు.

Sthanikam

భూ వివాదం బలిగొన్న బంధం.. తల్లిని హత్య చేసి కుమారుడు ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News