Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

కరాటే శారీరక దృఢత్వానికే కాదు.. మానసిక వికాసానికీ తోడ్పడుతుంది: ఫైట్ మాస్టర్ సతీష్

29-06-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్,

మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని అమ్మదయ కాలనీలో ఉన్న ఇబుకి డోజో కరాటే & ఫిట్‌నెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం బ్లాక్ బెల్ట్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ సెన్సీ అరుణ్ కాయల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్ సతీష్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, నటులు రిషిబా, అలెక్స్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మాస్టర్లు బి. రాము, ఏ. సతీష్, శ్రీనివాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

కరాటేలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాజ్ ప్రచండ్ర రెడ్డి, నయనిక, భావనతో పాటు పలువురు విద్యార్థులకు ముఖ్య అతిథులు బ్లాక్ బెల్ట్‌లు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు, ఆత్మరక్షణ నైపుణ్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ సతీష్ మాట్లాడుతూ, "కరాటే అనేది కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాదు. ఇది మానసిక వికాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు ఆత్మరక్షణ విద్యలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. బ్లాక్ బెల్ట్ సాధించడం ముగింపు కాదు.. కొత్త ప్రయాణానికి ఆరంభం" అని అన్నారు.

చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ సెన్సీ అరుణ్ కాయల మాట్లాడుతూ, అకాడమీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, గౌరవ భావన, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను కరాటే వైపు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, కార్యక్రమానికి హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అకాడమీ విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కరాటే శారీరక దృఢత్వానికే కాదు.. మానసిక వికాసానికీ తోడ్పడుతుంది: ఫైట్ మాస్టర్ సతీష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News