Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

నల్గొండ సభలో కలకలం.. సీఎం స్టేజీపై రాజకీయ రగడ!

29-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ, జూన్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న నల్గొండ బహిరంగ సభలో అనూహ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభా వేదికపై చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి.

సమాచారం ప్రకారం, నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని సీఎంవో భద్రతా సిబ్బంది స్టేజీ వద్ద అడ్డుకోవడంతో వివాదం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు, సన్మానం చేసేందుకు ప్రయత్నించిన సమయంలో భద్రతా సిబ్బంది నెట్టివేశారని ఆరోపిస్తూ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.సభ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వేదిక నుంచి దిగిన వెంటనే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సీఎంవో భద్రతా సిబ్బందితో బుర్రి శ్రీనివాస్ రెడ్డి వాగ్వాదానికి దిగగా, కొంతసేపు తోపులాట వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఉన్న నాయకులు, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఇదిలా ఉండగా, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు సభా ఏర్పాట్లలో తగిన ప్రాధాన్యం కల్పించలేదనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పున్నా కైలాష్ నేతను సమావేశానికి దూరంగా ఉంచేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.విశేషమేమిటంటే, సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పున్నా కైలాష్ నేత సేవలను ప్రశంసించినప్పటికీ, మరోవైపు ఆయన వర్గానికి చెందిన నేతలు సీఎంను కలిసే అవకాశాన్ని కోల్పోయారని అనుచరులు వాపోతున్నారు. గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సభ విజయవంతంగా ముగిసినా, వేదికపై చోటుచేసుకున్న ఈ ఘటనలు కాంగ్రెస్‌లోని వర్గపోరును మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఈ ఘటనపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Sthanikam

నల్గొండ సభలో కలకలం.. సీఎం స్టేజీపై రాజకీయ రగడ!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News