Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:16 PM

టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం

30-06-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా, కట్టంగూరు:

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో భీమవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.

అదుపుతప్పిన బస్సు రోడ్డు డివైడర్‌ను దాటి ఎదురుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమవగా, డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్ కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా నిలిచింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రమాదానికి టైర్ పేలడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు వాహనాలను పక్కదారి మళ్లించి రాకపోకలను పునరుద్ధరించారు.

Sthanikam

టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News