Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రంపల్లి పాల సంఘం అధ్యక్షురాలిగా శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 03:04 PM

రైతు ఆత్మహత్యల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం: రెడ్స్ డైరెక్టర్ భానుజా

రైతు ఆత్మహత్యల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం: రెడ్స్ డైరెక్టర్ భానుజా

రైతు ఆత్మహత్యల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం: రెడ్స్ డైరెక్టర్ భానుజా
June 30, 2026 01:18 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

సమాజంలో ఒంటరి మహిళల బాధలు రుణనాతీతం అని రెడ్స్ సంస్థ డైరెక్టర్ భానుజా పేర్కొన్నారు. అనంతపురం రూరల్ మండలం కురుకుంట లోని పుడమిసిరి మైదానంలో "సర్వేవర్స్ నెట్వర్క్ సమావేశం" నిర్వహించారు. ఈ సమావేశానికి రెడ్స్ సంస్థ డైరెక్టర్ భానుజా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సలహా సంస్థ జిల్లా జడ్జి రాజశేఖర్ హాజరయ్యారు. ఆయనకు బాధితులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అతని భార్య ఒంటరిగా మారుతుంది అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతు భార్యకు కుటుంబ సభ్యులు ఆస్తిలో భాగం ఇవ్వడానికై నిరాకరిస్తారు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో మృతిడి భార్య బిడ్డలకు ఆస్తిలో హక్కు ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పటివరకు చాలా ప్రాంతాలలో గృహహింసకు గురి అవుతున్న మహిళలు ఉన్నారని, ప్రతి మహిళ కొత్త వ్యక్తులను నమ్మి అక్రమ రవాణాకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళకు ఉందని ఆయన పేర్కొన్నారు మహిళా సాధికారత కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిడిపిఓ శ్రీదేవి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మిషన్ వాత్సల్య ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎవరైనా అనాధ పిల్లలు తల్లి ఉండి తండ్రి మృతి చెందిన పిల్లలకు ప్రభుత్వం ద్వారా మిషన్ వాత్సల్య క్రింద ప్రతినెల 4 వేల రూపాయలు అందడం జరుగుతుందని వివరించారు. నేటి సమాజంలో మహిళలు బాల బాలికలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అటువంటివి జరగకుండా ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వీటిని అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. మహిళల భద్రత కోసం బాలబాలికల భవిష్యత్తు కోసం ఉన్న పథకాలను ఐసిడిఎస్ నుండి వచ్చిన ప్రతినిధులు వివరించారు. చదువు మాన్పించిన చిన్న పిల్లలకు బాల్యవివాహాలు జరుగుతుంటే గ్రహించిన వారు 1098 నెంబర్ కు, మహిళ హెల్ప్ లైన్ 181 కు, మెంటల్ గా డిప్రెషన్ గురి అవుతున్న వారు 14416 నెంబర్ కు ఫోన్ చేయాలని ఆమె తెలిపారు. ఫోన్ చేసి తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. రెడ్సు సంస్థ డైరెక్టర్ భానుజా మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలు జరగకుండా ప్రతి గ్రామంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిజ్ఞ కూడా కార్యక్రమంలో చేయించారు.ఈ కార్యక్రమంలో సీఐడీఓ శ్రీదేవి, ఓఎస్సి కౌన్సిలర్ శాంతమని, డీవీసీ కౌన్సిలర్ ఉమాదేవి, ఐసిపిఎస్ డిసిపి యూనిట్ సంధ్య , కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ వందన, కేఎస్సీఎఫ్ కోఆర్డినేటర్ అనిత, రెడ్స్ సిబ్బంది సరిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News