Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!

04-07-2026 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తూప్రాన్‌పేట రామాలయం చోరీ కేసు ఛేదించిన చౌటుప్పల్ పోలీసులు

ఇద్దరు నిందితుల రిమాండ్

భక్తిని ముసుగుగా మార్చుకుని రామాలయంలో చోరీకి తెగబడిన ఇద్దరు అంతర్జిల్లా దొంగలను చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ శనివారం కేసు వివరాలను వెల్లడించారు. జూలై 2వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తూప్రాన్‌పేట గ్రామంలోని రామాలయంలో దొంగతనం జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి నిందితులు చోరీకి పాల్పడ్డారు. మన్సూరాబాద్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఉంటున్న రింగు భిక్షం, రుద్రాక్ష ఎల్లయ్యలు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీకి పాల్పడ్డారు. రుద్రాక్ష ఎల్లయ్యకు చెందిన TS 05 UF 3648 నెంబర్ గల ఆటోలో వచ్చి దొంగతనం చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆటోను సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Sthanikam

గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News