Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

అమరజీవి దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలి; సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

04-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నాగారం:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం పార్టీ నాగారం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి అన్నారు. శనివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన చారిత్రాత్మక పోరాటంలో దొడ్డి కొమురయ్య తన ప్రాణాలను అర్పించి అమరుడయ్యారని అన్నారు.ఆయన త్యాగం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చి వేలాది మంది ప్రజలను ఉద్యమ బాట పట్టించిందని గుర్తు చేశారు.

దొడ్డి కొమురయ్య కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జూలై 4 నుండి 25 వరకు మండలంలోని దళితవాడలు, గిరిజన తండాలలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించి, గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేయడంతో పాటు అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కడెం కుమార్, గుడిపురి వెంకటేశ్వర్లు, వెంకన్న, శ్రీధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అమరజీవి దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు కృషి చేయాలి; సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

Article Image

నాగారం:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం పార్టీ నాగారం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి అన్నారు. శనివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన చారిత్రాత్మక పోరాటంలో దొడ్డి కొమురయ్య తన ప్రాణాలను అర్పించి అమరుడయ్యారని అన్నారు.ఆయన త్యాగం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చి వేలాది మంది ప్రజలను ఉద్యమ బాట పట్టించిందని గుర్తు చేశారు.

దొడ్డి కొమురయ్య కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జూలై 4 నుండి 25 వరకు మండలంలోని దళితవాడలు, గిరిజన తండాలలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించి, గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేయడంతో పాటు అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కడెం కుమార్, గుడిపురి వెంకటేశ్వర్లు, వెంకన్న, శ్రీధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News