Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:11 PM

ఆర్థిక సాయంతో ‘లోకేశ్వరి’ స్వయం ఉపాధికి బాట: నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ‘ఈఎల్వీ’ ఫౌండేషన్

05-07-2026 239 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

*రూ. 70 వేల విలువైన బ్యూటీషియన్ కిట్ అందజేత

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి ఈఎల్వీ ఫౌండేషన్ మానవత్వంతో అండగా నిలిచింది. చౌటుప్పల్ పరిధిలోని ఎల్లగిరి గ్రామానికి చెందిన పోలేపల్లి అనిత భర్తకు దూరమై గత 11 ఏళ్లుగా ముగ్గురు ఆడపిల్లలను ఒంటరిగానే పోషిస్తోంది. తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిన పెద్ద కుమార్తె లోకేశ్వరి.. కుటుంబానికి భారం కాకూడదని, తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకుంది. బాబాయ్, అన్నల సహకారంతో బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసింది. సొంతంగా ఉపాధి ప్రారంభించడానికి అవసరమైన సుమారు రూ. 70,000 విలువైన మేకప్ కిట్ కొనుగోలు చేయడం ఆమెకు భారంగా మారింది. ఈ విషయాన్ని స్థానికులు ఈఎల్వీ ఫౌండేషన్ ఛైర్మన్ ఈఎల్వీ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. లోకేశ్వరి స్వయం ఉపాధికి తోడ్పాటునందిస్తూ రూ. 70 వేల విలువైన మేకప్ కిట్‌ను శనివారం తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. నిరుపేద యువతులు స్వయంశక్తితో ఎదగడానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని అన్నారు. ఫౌండేషన్ సాయంపై లోకేశ్వరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎల్వీ ఫౌండేషన్ డైరెక్టర్ ఈఎల్వీ అశోక్, ధీరజ్, వార్డు మెంబర్ బాలగోని శివశంకర్, మహ్మద్ ఇబ్రహీం, జెర్రిపోతుల వెంకటేష్, పోలేపల్లి లాలయ్య, శివరాంరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్థిక సాయంతో ‘లోకేశ్వరి’ స్వయం ఉపాధికి బాట: నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ‘ఈఎల్వీ’ ఫౌండేషన్

Article Image

*రూ. 70 వేల విలువైన బ్యూటీషియన్ కిట్ అందజేత

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి ఈఎల్వీ ఫౌండేషన్ మానవత్వంతో అండగా నిలిచింది. చౌటుప్పల్ పరిధిలోని ఎల్లగిరి గ్రామానికి చెందిన పోలేపల్లి అనిత భర్తకు దూరమై గత 11 ఏళ్లుగా ముగ్గురు ఆడపిల్లలను ఒంటరిగానే పోషిస్తోంది. తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిన పెద్ద కుమార్తె లోకేశ్వరి.. కుటుంబానికి భారం కాకూడదని, తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకుంది. బాబాయ్, అన్నల సహకారంతో బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసింది. సొంతంగా ఉపాధి ప్రారంభించడానికి అవసరమైన సుమారు రూ. 70,000 విలువైన మేకప్ కిట్ కొనుగోలు చేయడం ఆమెకు భారంగా మారింది. ఈ విషయాన్ని స్థానికులు ఈఎల్వీ ఫౌండేషన్ ఛైర్మన్ ఈఎల్వీ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. లోకేశ్వరి స్వయం ఉపాధికి తోడ్పాటునందిస్తూ రూ. 70 వేల విలువైన మేకప్ కిట్‌ను శనివారం తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. నిరుపేద యువతులు స్వయంశక్తితో ఎదగడానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని అన్నారు. ఫౌండేషన్ సాయంపై లోకేశ్వరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎల్వీ ఫౌండేషన్ డైరెక్టర్ ఈఎల్వీ అశోక్, ధీరజ్, వార్డు మెంబర్ బాలగోని శివశంకర్, మహ్మద్ ఇబ్రహీం, జెర్రిపోతుల వెంకటేష్, పోలేపల్లి లాలయ్య, శివరాంరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News