Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

నందిపాడు చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

05-07-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కంటైనర్ ఢీకొని దంపతులకు తీవ్ర

గాయాలు.. అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్ అంతరాయం.

మిర్యాలగూడ, జూలై 5: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని నందిపాడు ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం, టూ వీలర్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు నందిపాడు చౌరస్తా వద్ద రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన కంటైనర్ వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మిర్యాలగూడ మండలం ట్యాంకుతండకు చెందిన ధనావత్ సకురు (55), కమ్మిలి (60) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సాయంతో క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం కారణంగా అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

నందిపాడు చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News