Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:19 PM

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తపస్

04-07-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇబ్రహీంపట్నం: ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజరి రమేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఆర్‌సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులకు నిధుల మంజూరు, పెన్షనర్ల బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కేజీబీవీ, మోడల్, గురుకుల, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, పాఠశాలలకు మౌలిక వసతుల కోసం ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు వడ్ల రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి రాపోలు ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి పట్నం కృష్ణ, మహిళ కో-కన్వీనర్ సంజీవరాణి, కోశాధికారి రాము, మీడియా కన్వీనర్ పొట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తపస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News