Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:18 PM

దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

04-07-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పిలుపునిచ్చారు.

శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య 81వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన అడుగుజాడల్లో పనిచేసే అవకాశం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సుబ్బారెడ్డి, కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News