Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

ఆనందంగా నేర్చుకుంటూ భవిష్యత్తుకు సిద్ధమయ్యే విద్య.. కిండర్‌బాట్స్ ప్రత్యేకత

04-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిండర్‌బాట్స్ ఏఐ, రోబోటిక్స్ ప్రీ స్కూల్ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చిన్నారులకు ఆధునిక విద్య అందించే లక్ష్యంతో ఈ ప్రీ స్కూల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూల్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ, 2 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఏఐ, రోబోటిక్స్, ఎస్‌టీఈఎమ్ విద్య, ఆటల ద్వారా అభ్యాసం, ఆధునిక తరగతి గదులు, సురక్షితమైన వాతావరణంలో బోధన అందిస్తామని తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే ప్రత్యేక పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్‌పర్సన్ రేణుక చిరు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆనందంగా నేర్చుకుంటూ భవిష్యత్తుకు సిద్ధమయ్యే విద్య.. కిండర్‌బాట్స్ ప్రత్యేకత

Article Image

సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిండర్‌బాట్స్ ఏఐ, రోబోటిక్స్ ప్రీ స్కూల్ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చిన్నారులకు ఆధునిక విద్య అందించే లక్ష్యంతో ఈ ప్రీ స్కూల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూల్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ, 2 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఏఐ, రోబోటిక్స్, ఎస్‌టీఈఎమ్ విద్య, ఆటల ద్వారా అభ్యాసం, ఆధునిక తరగతి గదులు, సురక్షితమైన వాతావరణంలో బోధన అందిస్తామని తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే ప్రత్యేక పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్‌పర్సన్ రేణుక చిరు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News