Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లో రాష్ట్ర టాపర్‌గా జోయన్నా ఘన విజయం

04-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థినికి స్కాలర్‌షిప్.. యాజమాన్యం హర్షం.

నల్గొండ, జూలై 4: నల్గొండ జిల్లా చెర్లపల్లిలోని ఓక్‌ట్రీ స్కూల్ (ది ఫ్యూజన్ స్కూల్) విద్యార్థిని టి.ఎన్. జోయన్నా అంతర్జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఇంటర్నేషనల్ టాలెంట్ ఒలింపియాడ్ (ఐటీఓ)లో 5వ తరగతి-బి చదువుతున్న జోయన్నా స్టేట్ టాపర్‌గా నిలిచి ప్రతిభా స్కాలర్‌షిప్‌ను కైవసం చేసుకుంది.విద్యార్థిని సాధించిన ఈ విశిష్ట విజయంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. జోయన్నా కృషి, ఉపాధ్యాయుల నాణ్యమైన బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా ప్రమాణాల ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొంది.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ తుమ్మలపల్లి హనుమంత్ రెడ్డి అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. అలాగే డైరెక్టర్లు మంగా రెడ్డి, సునీల్ రెడ్డి విద్యార్థినిని, ఆమె తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందిస్తూ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

జోయన్నా సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Sthanikam

ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లో రాష్ట్ర టాపర్‌గా జోయన్నా ఘన విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News