Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:04 PM

దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

04-07-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సండే మార్కెట్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం, పోరాటం చిరస్మరణీయమని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆయన ప్రాణత్యాగం చేసి తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేశారని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పుష్ప నాగేష్, లాడే మల్లేశం, లాడే బాలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణకు శాశ్వత స్ఫూర్తి – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Article Image

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సండే మార్కెట్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం, పోరాటం చిరస్మరణీయమని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆయన ప్రాణత్యాగం చేసి తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేశారని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పుష్ప నాగేష్, లాడే మల్లేశం, లాడే బాలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News